తవ్వకాల్లో బయటపడిన 425 బంగారు నాణేలు.. వెయ్యేళ్ళ క్రితం నాటివి..!

-

ఇజ్రాయిల్‌ పురావస్తు శాస్త్రవేత్తలు బంగారు నాణేలను కనుగొన్నారు. ఇవి సుమారు 1,100 సంవత్సరాల కిందట ఉన్న అబ్బాసిద్ కాలానికి చెందిన 425 బంగారు నాణేలుగా గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు.ఇవి తొలి ఇస్లామిక్‌ నాణేలని ఇజ్రాయిల్ ఆంటిక్విటీస్ అథారిటీస్ పురావస్తు శాస్త్రవేత్తలు లియాత్ నడావ్-జివ్, ఎలీ హడ్డాడ్ ఒక సంయుక్త ప్రకటనలో చెప్పారు.ఇంత మొత్తంలో అత్యంత పురాతన నాణేలు దొరడం ఇజ్రాయిల్‌లో ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.ఈ నిధి కనిపెట్టిన టీమ్ లో ఉంది అందరూ యువకులే..యువ వలంటీర్ల తవ్వకాల్లో వందల కొద్దీ నాణేలు వెలుగు చూశాయి.నిపుణుడు రాబర్ట్‌ కూల్‌ కీలక సమాచారం దీని గురించి వెల్లడించారు.రాబర్ట్‌ కూల్‌ మాట్లాడుతూ ఓ ప్రాథమిక విశ్లేషణ ప్రకారం 9వ శతాబ్దం చివరి కాలం నాటి నాణేలని తెలిపారు.


2015లో ఔత్సాహిక డైవర్స్‌ 10, 11వ శాతాబ్దంలోని ఫాతిమిడ్‌ కాలానికి చెందిన పురాతన నగరమైన కైసర్‌ తీరంలో సుమారు 2వేల నాణేలను కనుగొన్నారు. ‘ఈ అధ్యయనం గత కాలం గురించి మాకు మరింత సమాచారం తెలియజేస్తుందని ఆశిస్తున్నాను’ అని రాబర్ట్‌ పేర్కొన్నారు.ఈ విధంగా బంగారం ఎప్పుడు దొరక లేదు కాబట్టి వీటికి సంబంధించి అత్యంత ఎక్కువ సమాచారం వీరి దగ్గర లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version