ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారి ఒకరు వెల్లడించారు. తన సోదరి కిమ్ యోంగ్ ఉన్‌కు కొన్ని అధికారాలు కట్టబెట్టిన అనంతరం ఆయన ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డై జంగ్ సహచరుడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. తీవ్రంగా జబ్బుపడి మరణించారన్న కథనాలు కూడా వచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత ఓ ఫ్యాక్టరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయినప్పటికీ ఈ వదంతులకు అడ్డుకట్టపడలేదు. కిమ్ సోదరి ఆయన తరపున అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ మధ్య కిమ్ ఆహారం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు శునకాలను లాక్కుంటున్నారు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకొరియా, దక్షిణ కొరియాలో రెస్టారెంట్లలో శునకాల మాంసంతో చేసిన వంటకాలు రుచికరంగా ఉంటాయట. ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆహార సరఫరాలో సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభానికి కూడా కిమ్.. ప్రజలతోనే పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.