డిజిటల్‌ చెల్లింపుల్లో 46శాతం ఇండియాలోనే: శక్తి కాంత్ దాస్

-

గత 12 సంవత్సరాలలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని ఆర్బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.వరల్డ్ లోనే మొత్తం డిజిటల్ పేమెంట్స్లో దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని పేర్కొంది. ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయంలో జరిగిన డిజిటల్‌ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.

2012-13 ఆర్థిక సంవత్సరంకి గాను దేశంలో 162 కోట్ల రిటైల్‌ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ జరిగాయి. అదే 2023-24 నాటికి ఆ సంఖ్య 14,726 కోట్లకు పెరిగింది. అంటే గత 12 సంవత్సరాలలో డిజిటల్‌ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయి. వరల్డ్ వైడ్ గా మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో దాదాపు 46శాతం ఇండియాలోనే జరుగుతున్నాయి” అని శక్తికాంతదాస్‌ తెలిపారు. ఇక, ‘యూపీఐ ‘ అనేది ఇండియాలోనే గాక.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా మారిందని అన్నారు.ప్రస్తుతం రోజుకు సగటున 43 కోట్ల యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి” అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version