ఓటీటీ లోకి వచ్చేసిన ’12th ఫెయిల్’ మూవీ

-

విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే నటించిన చిత్రం’12th ఫెయిల్’. ప్రముఖ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.గతేడాది అక్టోబర్ 27న విడుదలై బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది.భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంది. 2019లో 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలుపడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అని అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇక తెలుగు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ’12th ఫెయిల్’ తెలుగు వెర్షన్ ఓటీటీ లోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్గార్లో ఈరోజు నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత OTTలోకి వచ్చినా కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version