పోస్ట్‌ ఆఫీస్‌లో టైమ్‌ డిపాజిట్‌ స్కీమ్‌తో 5 లక్షల లాభం.. ఎస్పీఐ కంటే బెటర్‌

-

డబ్బులు ఉంటే.. వాటిని సరైన మార్గాల్లో పొదుపు చేయాలి అప్పుడే అవి డబుల్‌ అవుతాయి. తెలిసినవాళ్లే కదా అప్పులకు ఇస్తే.. తిరిగి ఇస్తారో లేదో తెలియని పరిస్థితి.. గట్టిగా అడలేం.. ఇక లాక్కులేక పీక్కోలేక నానా ఇబ్బందులు పడతాం. అదే మీ డబ్బును రిస్క్‌ లేని దగ్గర ఇన్వస్ట్‌ చేస్తే మంచి రిటర్న్స్‌ వస్తాయి. రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. పోస్టాఫీస్‌లో పలు రకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేసుకోవచ్చు. అయితే దీని కోసం దీర్ఘ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.

మీరు పోస్టాఫీస్‌లో ఎస్‌బీఐ కన్నా ఎక్కువ వడ్డీ సొంతం చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్‌లో ఐదేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. అయితే మీకు పోస్టాఫీస్‌లో ఐదేళ్ల ఎఫ్‌డీలపై 7.5 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. అలాగే మీరు ఏడాది టెన్యూర్‌లో డబ్బులు దాచుకోవాలని చూస్తే వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. అదే రెండేళ్ల టెన్యూర్ అయితే 7 శాతం, మూడేళ్ల టెన్యూర్‌పై కూడా 7 శాతం వడ్డీ పొందొచ్చు.

మీరు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లలో డబ్బు దాచుకుంటే.. మీ ఇన్వెస్ట్‌మెంట్ 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం అయితే 114 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు పెట్టాలని అనుకున్నారు. వడ్డీ రేటు 7.5 శాతం. మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు. మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 7.25 లక్షలు వస్తాయి. వడ్డీ రాబడి రూ. 2.25 లక్షలుగా ఉంది. అదే రూ.10 లక్షలు పెడితే మీకు మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 5 లక్షల వరకు లాభం వస్తుంది. ఈ పథకంలో ఎవరైనా చేరొచ్చు. జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. టైమ్ డిపాజిట్లలో డబ్బులు పెట్టడం ద్వారా మీరు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద ఈ ప్రయోజనం పొందొచ్చు.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో రూ.1000 నుంచి డబ్బలు పొదుపు చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. వడ్డీ మొత్తాన్ని త్రైమాసికం చొప్పున లెక్కిస్తారు కానీ ఏడాది ప్రాతిపదికనే చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలోనే మీరు పెట్టిన డబ్బులు, వచ్చిన వడ్డీని ఒకేసారి పొందొచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. పెట్టే డబ్బులు ఆధారంగా మీకు వచ్చే రాబడి మారుతుందని గమనించుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version