అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ కొనసాగుతుంది. కీలకమైన ఐదు రాష్ట్రాల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. అధ్యక్షుడిగా విజయానికి ఆరు ఎలక్టోరల్ దూరంలో ఉన్నారు జో బైడెన్. అయితే తమ పార్టీకి కంచుకోటగా నిలిచే నెబాడా రాష్ట్రంలో ఉన్న ఆరు ఎలక్టోరల్ ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు బైడెన్ కు మెండుగా ఉన్నాయి. మరో వైపు కేవలం 214 ఎలక్టోరల్ వోట్లతో మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంగా ఉన్నాడు ట్రంప్. కానీ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉందని రాష్ట్రాలన్నీ తన ఖాతాలోనే పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
దీంతో విజయం తనకే దక్కుతుందని నమ్మకంతో ఉన్నాడు. జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడా, అలాస్కాలో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ కంటే బైడేన్ ముందే ఉన్నా నా ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడి కాకపోవడంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. జార్జియాలో 16 ఎలక్టోరల్ ఓట్లు పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు నార్త్ కరోలినా లో 16 ఎలక్టోరల్ ఓట్లు నెవాడాలో ఆరు ఎలక్టోరల్ ఓట్లు ఇప్పుడు అధ్యక్స్యుడి గెలుపుకు కీలకంగా మారనున్నాయి .