నాగార్జునసాగర్‌కు రోజుకు 5 టీఎంసీల నీరు

-

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు.. ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహాలతో తెలంగాణ వ్యాప్తంగా జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. నాగార్జునసాగర్ జలాశయంలో రోజుకు 5 టీఎంసీల నీటి నిల్వ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జులై 24 వరకు 41.91 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 542.30 అడుగుల వరకు నీరు చేరింది.

మరోవైపు శ్రీశైలం నుంచి కొంతవరకు నీటి విడుదల తగ్గింది. తుంగభద్ర, ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుంచి కూడా ప్రవాహం తగ్గడమే దీనికి కారణం. గోదావరి పరీవాహకంలో ఎల్లంపల్లి నుంచి 2.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు విడుదలవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి 6.89 లక్షల క్యూసెక్కుల జలాలను వదులుతున్నారు. నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల నుంచి విడుదల కొనసాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version