పెళ్లైన నెలకే భార్య 4 నెలల గర్భవతి.. కంగుతిన్న భర్త!

-

పెళ్లైన నెలకే భార్య 4 నెలల గర్భవతి కంగుతిన్నాడు ఓ భర్త. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌ లని మహారాజ్‌ గంజ్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. యూపీలోని మహారాజ్ గంజ్ కు చెందిన రమేష్‌ సింగ్‌ అనే వ్యక్తికి సరిగ్గా నెలకిందట వివాహం అయింది. యూపీలో స్థానికంగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ..బాగానే సంపాదిస్తున్నాడు రమేష్‌ సింగ్‌.

ఈ నేపథ్యంలోనే సవిత సర్కారీ అనే యువతితో రమేష్‌ వివాహం నెలకిందట జరిగింది. అయితే.. పెళ్లి జరిగి నెల పూర్తయింది. ఈ నేపథ్యంలోనే తనకు బాగా కడుపు నొప్పి వస్తోందని, భర్త రమేష్‌ కు చెప్పింది సవిత. దీంతో స్థానిక ఆస్పత్రికి సవితను తీసుకునిపోతే.. అసలు విషయం బయట పడింది. సవితకు 4 నెలల ప్రెగ్నెన్సీ ఉందని తేలింది.

దీంతో రమేష్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం, సవిత కుటుంబ సభ్యులను పిలిపించి, పంచాయితీ పెట్టించాడు. ఆ తర్వాత, స్థానిక కోర్టులో విడాకులకు అప్లై చేశాడు రమేష్‌. ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే, సవితకు ఇప్పటికే ఓ లవర్‌ ఉన్నాడని, అతనితో పలు మార్లు సెక్స్‌ లో పాల్గొనడంతో ప్రెగ్నెన్సీ వచ్చిందని తేలింది. ఇక ఈ విషయం తెలియడంతో, సవిత కుటుంబ సభ్యులు కూడా విడాకులకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version