3 నెలల త‌రువాత క‌న్న‌త‌ల్లి వ‌ద్ద‌కు.. విమానంలో 5 ఏళ్ల బాలుడి ఒంట‌రి ప్ర‌యాణం..

-

క‌రోనా లాక్‌డౌన్ ఎంతో మందిని తమ కుటుంబ స‌భ్యుల‌కు దూరం చేసింది. లాక్‌డౌన్ వ‌ల్ల ఎక్క‌డివారు అక్క‌డే చిక్కుకుపోయారు. దీంతో త‌మ కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఈ క్ర‌మంలోనే ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా రైళ్లు, బ‌స్సులు, విమానాలు తిరిగేందుకు అనుమ‌తినిస్తున్నారు. దీంతో దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఎట్ట‌కేల‌కు త‌మ సొంత ఊళ్ల‌కు వెళ్తున్నారు. ఇక 5 ఏళ్ల వ‌య‌స్సున్న ఓ బాలుడు ఎట్ట‌కేల‌కు 3 నెల‌ల అనంత‌రం త‌న క‌న్న‌త‌ల్లి వ‌ద్ద‌కు విమానంలో ఒంట‌రిగా ప్ర‌యాణించి చేరుకున్నాడు.

బెంగ‌ళూరుకు చెందిన 5 ఏళ్ల విహాన్ శ‌ర్మ లాక్‌డౌన్ వ‌ల్ల ఢిల్లీలో చిక్కుకుపోయాడు. అయితే 3 నెల‌ల అనంత‌రం ప్ర‌స్తుతం విమానాలు న‌డుస్తుండ‌డంతో అత‌ను ఢిల్లీ నుంచి బెంగ‌ళూరుకు ఒంట‌రిగా విమానంలో ప్ర‌యాణించి ఎట్ట‌కేల‌కు క‌న్న‌త‌ల్లి వ‌ద్ద‌కు చేరుకున్నాడు. త‌న కుమారున్ని తీసుకెళ్లేందుకు ఆ మ‌హిళ బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రినీ తీసిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా విమానాల్లో వ‌చ్చే ప్ర‌యాణికులు కేంద్రం సూచ‌న‌ల ప్ర‌కారం 7 రోజుల పాటు త‌మ సొంత ఖ‌ర్చుల‌తో క్వారంటైన్‌లో ఉండాలి. అదే 10 ఏళ్ల లోపు పిల్ల‌లు, 80 ఏళ్ల వృద్ధులు అయితే ఇంట్లో క్వారంటైన్‌లో ఉండ‌వ‌చ్చు. కానీ వారికి తోడుగా వేరే ఎవ‌రైనా పెద్ద‌లు ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version