రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ 21 నాటికి యాభై స్పెషల్ ట్రైన్స్..!

-

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. కరోనా మహమ్మారి పరిస్థితి మెరుగుపడటం మరియు ప్రయాణీకుల డిమాండ్ పెరగడం వలన మహమ్మారి కారణంగా నిలిపివేయబడిన 50 ప్రత్యేక రైళ్లని జూన్ 21 నుండి రైల్వే శాఖా తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతోంది. దీనితో ప్రయాణికులకు కాస్త సహాయంగా ఉంటుంది. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాలలోకి వెళితే..

జూన్ 25 నుండి ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్పూర్ నుండి మహారాష్ట్రలోని బాంద్రా టెర్మినస్ వరకు కొత్త సమ్మర్ స్పెషల్ రైలును ప్రారంభిస్తున్నారు. భారత రైల్వే జూన్ 21 నుండి 50 ప్రత్యేక రైలు సేవలను తిరిగి ప్రారంభించనుంది.

జూన్ 25 నుండి ఉత్తర ప్రదేశ్, గోరఖ్పూర్ నుండి మహారాష్ట్ర బాంద్రా టెర్మినస్ వరకు కొత్త సమ్మర్ స్పెషల్ రైలు అందుబాటులోకి వస్తోంది. జూన్ 1-18 మధ్య, జోనల్ రైల్వేలకు 660 మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడానికి పర్మిషన్ ని కూడా ఇవ్వనున్నారు.

జూన్ మొదటి వారంలో ప్రతిరోజూ నడుస్తున్న 800 మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉండగా.. శుక్రవారం నాటికి 983 మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు వున్నాయి. జూన్ 1-18 మధ్య, జోనల్ రైల్వేలకు 660 అదనపు మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడానికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది.

ఇక స్పెషల్ ట్రైన్స్ కి సంబంధించి వివరాలని చూస్తే.. ప్రత్యేక రైళ్లలో న్యూ ఢిల్లీ-కల్కా శాతాబ్ది ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ-డెహ్రాడూన్ శాతాబ్డి ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ-అమృత్సర్ జంక్షన్ శాతాబ్డి ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ జంక్షన్-కోట్వారా శతాబ్డి ఎక్స్‌ప్రెస్, చండీగ న్యూ ఢిల్లీ శాతాబ్డి ఎక్స్‌ప్రెస్.

ఢిల్లీసరాయి రోహిల్లా, మాతా వైష్ణో దేవి కత్రా-న్యూ ఢిల్లీ శ్రీ శక్తి, కల్కా-సిమ్లా ఎక్స్‌ప్రెస్, బిలాస్‌పూర్ జంక్షన్-న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్, జమ్మూ తవి-యోగ్నగరి రిషికేశ్ ఎక్స్‌ప్రెస్, లక్నో-ప్రయాగ్రాజ్ సంగం ఎక్స్‌ప్రెస్, ఛప్రా-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ మరియు ఫరూఖాబాద్ వున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version