స్టేట్ బ్యాంక్ అదిరే స్కీమ్.. నెల నెలా చేతికి రూ.10 వేలు..!

-

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అదిరిపోయే స్కీమ్ ని ఒకటి అందిస్తోంది. దీని వలన ఎన్నో లాభాలు పొందొచ్చు. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ పేరు ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్. ప్రతి నెలా రూ.10 వేలు పొందొచ్చు.

ఈ స్కీమ్ లో మొత్తం నాలుగు రకాల టెన్యూర్లు అందుబాటులో ఉన్నాయి. 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలు. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ని మీరు ఎంచుకోవచ్చు. అదే విధంగా టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లు ఇక్కడ కూడా వర్తిస్తాయి. కాల పరిమితిని ఎంచుకొని ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

పదేళ్ల కాల పరిమితి తో డబ్బులు డిపాజిట్ చేస్తే పదేళ్ల కాల పరిమితి లోని ఎఫ్‌డీ రేట్లకు వర్తించే వడ్డీ రేటు ప్రకారమే డబ్బులు మీకు వస్తూ ఉంటాయి. మీరు ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో ఎంత డబ్బులు అయినా డిపాజిట్ చేయొచ్చు.

గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు పథకంలో చేరితే కనీసం రూ.1000 నుంచి పొందొచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ బెనిఫిట్ కూడా లభిస్తుంది.

రూ.5.07 లక్షలు డిపాజిట్ చేస్తే 7 శాతం వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే పది వేలు వస్తాయి.
మీకు వచ్చే డబ్బుల్లో మీరు డిపాజిట్ చేసిన డబ్బుల్లో కొంత భాగం, వడ్డీ కలిసి ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version