అనుష్క పేరుతో 51 లక్షల ఫ్రాడ్!

-

సినీ నటి అనుష్క అపాయింట్ మెంట్ ఇప్పిస్తామంటూ… వర్తమాన ప్రొడ్యూసర్ లక్ష్మన్ చారీకి ఓ కేటుగాడు…గాలం వేశాడు. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, నిర్మాత లక్ష్మన్ చారీ నుండి ఏకంగా 51 లక్షలు వసూలు చేశాడు సినిమా మేనేజర్ ఎల్లారెడ్డి. అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ డేట్స్ ఇప్పిస్తామంటూ నిర్మాతను మోసం చేశాడు.

దీంతో బంజారాహిల్స్ పోలీస్ లను ఆశ్రయించాడు నిర్మాత లక్ష్మన్ చారీ. నిర్మాతను పలు మార్లు బెంగళూర్ తీసుకెళ్ళి…మోతి మహల్ హోటల్ లో పలువురిని పరిచయం చేసిన ఎల్లారెడ్డి.. మేనేజర్ ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించాడు నిర్మాత లక్ష్మన్ చారీ. అంతేకాదు, నిర్మాతల మండలికి కూడా మేనేజర్ ఎల్లారెడ్డిపై ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version