విశాఖలో మరో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య

-

విశాఖలో మరో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేశారు. విశాఖ శివారు పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఈ దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఆరుగురిని ఒక వ్యక్తి హత్య చేశాడు. హత్య చేసిన వ్యక్తి బత్తిన అప్పలరాజు గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

murder

మృతులు  బమ్మిడి రామారావు 63 సంవత్సరాలు,  బమ్మిడి ఉషారాణి 35 సంవత్సరాలు, అల్లు రమాదేవి 53 సంవత్సరాలు, నకెట్ల అరుణ 37 సంవత్సరాలు, బమ్మిడి ఉదయ్ 2 సంవత్సరాలు, బమ్మిడి ఊర్విష 6 నెలలు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రెండు కుటుంబాల మధ్య పాత కక్షలతో అర్ధరాత్రి ఈ హత్యలు జరిగినట్లు చెబుతున్నారు. ఆస్తి తగాదాలు ఈ కక్షలకు కారణం అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version