ఆయిల్ మసాజ్ అంటే అదేదో ధనవంతులు మాత్రమే విలాసం కోసం చేయించుకుంటారు అంటే పొరపాటే. ఎందుకంటే.. ఆయిల్ మసాజ్‌ను ఎవరైనా చేసుకోవచ్చు. దాని వల్ల మనకు అనేక అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మనకు ప్రస్తుతం అనేక ఆయుర్వేద మసాజ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. లేదా కొందరు ఇంటి వద్దకే మసాజ్ సేవలను అందిస్తున్నారు. అలా కూడా ఆయిల్ మసాజ్ చేయించుకోవచ్చు. మరి ఆయిల్ మసాజ్ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఆయిల్ మసాజ్ చేయించడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం శుభ్రంగా మారుతుంది. ఏవైనా దోషాలు ఉంటే పోతాయి. ఆరోగ్యం చక్కబడుతుంది.
2. అధిక బరువు తగ్గాలనుకునే వారు తరచూ ఆయిల్ మసాజ్ చేయించుకుంటే ఫలితం ఉంటుంది.
3. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఆయిల్ మసాజ్ చేయించుకుంటే నిద్ర చక్కగా పడుతుంది.
4. ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన, డిప్రెషన్ బారిన పడ్డవారు ఆయిల్ మసాజ్‌తో ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.
5. ఆయిల్ మసాజ్ వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.
6. ఆయిల్ మసాజ్‌తో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.