స్కూల్ బల్లపై కేరళ సంప్రదాయ సంగీతం…మూడోతరగతి బుడ్డోడి మ్యాజిక్

-

పిల్లలు, యూత్ అందరికీ కూడా దొరికిన కొద్దీ పాటి స్థలంలో ఎదో పెద్ద విద్వాంసులు లాగా దొరికిన కుర్చీలు,బల్లలపై దరువు వాయిస్తూ ఉండడం గుర్తు ఉండే ఉంటుంది. ఈ సరదా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, అందుకే దాదాపు ప్రతి ఒక్కరూ కూడా తమ బాల్యం లేదా, యవ్వన సమయంలో ఇలాంటి పనులు చేసే ఉండి ఉంటారు. అయితే అప్పటి సంగతులు గురించి జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఆ రోజులు మళ్లీ ఇప్పుడు మనకు రాలేవు అని చెప్పాలి. అయితే కేరళ లో ఒక విద్యార్థి స్కూల్ బెంచ్ పై వాయించిన వాయిద్యం సోషల్ మీడియా లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనలవి కాదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కేరళలలోని అళప్పుళ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో సనూప్‌ అనే విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడు. అతడికి సంగీతం అంటే చవి కోసుకుంటాడట. అయితే లంచ్ బ్రేక్ లోనో,లేదంటే క్లాస్ రూమ్ కి టీచర్ ఆలస్యంగా వచ్చినప్పుడు విద్యార్థుల్లో అల్లరి సంగీతంలా మారి బెంచి మీద వాయిస్తూ ఉంటాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగానే ఈ విద్యార్థి ఇప్పటినుంచే సంగీత దర్శకుడికి ఉన్న లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు.

అయితే అతడు వాయించేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేశారు. అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. లంచ్‌ బ్రేక్‌లో ఇలా తన తోటి విద్యార్థులతో కలిసి నిల్చొని బెంచీపై కేరళ సంప్రదాయ సంగీతాన్ని చక్కగా వాయించాడు. తోటి విద్యార్థులు ఔరా అంటూ అతన్ని అలా చూస్తుండిపోయారు. ఆ దృశ్యాన్ని జయశంకర్‌ అనే ఉపాధ్యాయుడు తన ఫోన్‌తో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియో లక్షల్లో లైకులు సంపాదించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version