డిజిట‌ల్ ఇండియాలో భాగంగా 75వేల కోట్ల గూగుల్ పెట్టుబ‌డులు: సుంద‌ర్ పిచాయ్‌

-

గూగుల్ ఇండియా సంస్థ అతి త్వరలో భారత్ లో 75 వేల కోట్ల రూపాయలను స్టార్ట్ అప్స్ లో పెట్టుబడి పెట్టబోతున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన అధికార ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీనితో భారతీయ ఆవిష్కర్తలకు మంచి ప్రోత్సాహం లభించబోతుంది. గూగుల్ ఆఫ్ ఇండియా కార్యక్రమ నేపథ్యంలో భాగంగా సుందర్ పిచాయ్ ఈ భారీ పెట్టుబడులను ప్రకటించారు. భారత ప్రధాని చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతుగా నిలవడానికి చాలా గర్వంగా ఉందని, అలాగే 10 బిలియన్ డాలర్ల నిధులతో భారతీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని సుందర్ పిచాయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

digital india

నేటి ఉదయం ప్రధాని మోదీ తో సుందర్ పిచాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక అంశాలపై చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అర్థమవుతుంది. వారిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ లో పలు రకాల అంశాలపై చర్చించినట్లు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నిజంగా ఇంత పెద్ద పెట్టుబడులు భారత్ కు తీసుకరావడం అనేది నిజంగా సుందర్ పిచాయ్ కి తన దేశం పై ఉన్న దేశభక్తిని చాటుతుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version