సచివాలయ భవనాల కూల్చివేత ఈ నెల 15 వరకు ఆపాలని హైకోర్టు అదేశాలు జారీ చేసింది. సచివాలయ భవనాల కూల్చివేత పిటీషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. భవనాల కూల్చివేత అనుమతులను కౌంటర్ ద్వారా కోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని హైకోర్టు అదేశించింది. ఈరోజు సాయంత్రానికి కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.
దీంతో బుధవారం వరకు సచివాలయ కూల్చివేతపై హై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జులై 15కి వాయిదా వేసింది. కూల్చివేత పనుల్లో నిబంధనలు పాటించడం లేదని, అసలు కేబినెట్ తీసుకున్న నిర్ణయంలోనే లోపాలున్నాయంటూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించడంతో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.