కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఇక నుండి పెన్షన్ స్లిప్ వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా పొందచ్చు ..!

-

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇక నుండి పెన్షనర్లకు పెన్షన్ స్లిప్ ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా వస్తుంది. ఎంత డబ్బులు క్రెడిట్ అయ్యాయి, ఎంత ట్యాక్స్ కట్ అయ్యింది అనే విషయాలు పూర్తిగా దీనిలో ఉంటాయి.

తాజాగా జరిగిన సెంట్రల్ పెన్షన్ ప్రోసెసింగ్ సెంటర్స్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎంత పెన్షన్ క్రెడిట్ అయ్యింది, ఎంత టాక్స్ కట్ అయ్యింది వంటి ముఖ్యమైన వివరాలను పూర్తిగా దీని ద్వారా తెలియజేస్తారు.

పెన్షనర్ల ‘Ease of living’ ఉద్దేశించి ఈ సమావేశం జరిగింది. ఇందులో పెన్షనర్లకు నెలవారీ పెన్షన్ విషయాలు చర్చించారు. పెన్షన్ విభాగం మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ తో కలిపి జరిగిన సమావేశంలో వీటిపై చర్చించడం జరిగింది.

బ్యాంకులు కూడా ఈ విషయంపై సరే అన్నాయి. ఈ సమాచారాన్ని అందించడానికి వాళ్లు కూడా ఆనందాన్ని వ్యక్త పరిచారు. పెన్షన్ క్రెడిట్ అయిన తర్వాత పెన్షనర్లకు బ్యాంక్ నుండి పెన్షన్ స్లిప్ ని అందిస్తారు.

రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఈ పెన్షన్ స్లిప్ ని పంపిస్తారని చెప్పారు. అలానే బ్యాంకులు కూడా సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్ వంటివి వాడుతున్నారు. అయితే ఈ పెన్షన్స్ లో నెలవారి పెన్షన్ ఎంత క్రెడిట్ అయింది, ఎంత ట్యాక్స్ కట్ అయింది వంటి పూర్తి సమాచారాన్ని ఇస్తాయి.

వీటి వల్ల పెన్షనర్లకి మరెంత క్లియర్ గా, క్లారిటీగా ఉంటుంది. 7th Pay Commission రికమెండేషన్ వలన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతం, పెన్షన్ అందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version