ఫ్యాక్ట్ చెక్: డియోడ్రెంట్ ని ఉపయోగించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదా..!

-

తాజాగా ఒక సోషల్ మీడియా పోస్ట్ లో డియోడరెంట్స్ ని ఉపయోగించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని ఉంది. అయితే నిజంగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా రాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా వచ్చిన పోస్ట్ ప్రకారం ఏముంది అనే విషయాన్ని చూస్తే.. డియోడ్రెంట్ ని ఉపయోగించడం మానేయండి. ముఖ్యంగా మహిళలు డియోడ్రెంట్ ని ఉపయోగించడం వల్ల సమస్యలు వస్తాయని ఉంది.

అయితే చాల మంది రెగ్యులర్ గా వాడతారు కానీ అలా వాడడం మంచిది కాదు అని.. డియోడ్రెంట్ ని కేవలం నెలకి రెండు సార్లు మాత్రమే ఉపయోగించండి. ఇలా చేయడం వలన క్రిములు తొలగిపోతాయి అని దానిలో ఉంది.

అయితే దీనిలో ఎంత నిజం అనే విషయాన్ని చూస్తే… స్టడీ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ డియోడ్రెంట్ ని ఉపయోగించడం వల్ల రాదని తేలింది. ఇటువంటి మెసేజ్లు లేదా పోస్టులని నమ్మటం, ఫార్వార్డ్ చేయడం మంచిది కాదని.. వీటి వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు నిపుణులు.

ఇది ఇలా ఉంటే డియోడరెంట్స్ కి మరియు బ్రెస్ట్ క్యాన్సర్ కి మధ్య ఏ సంబంధం లేదని.. డియోడ్రెంట్ కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాదని తేలిపోయింది. కనుక ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మి అనవసరంగా భయపడకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version