పారిస్ ని వణికించిన 8 మంది అమ్మాయిల గ్యాంగ్…!

-

మసాజ్ పేరు అంటూ, అబ్బాయిలకు ఎరవేసి డబ్బును వసూలు చేస్తున్న గ్యాంగ్ ని ఫ్రాన్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే టర్కీకి చెందిన ఓ వ్యక్తి పారిస్‌లోనే ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఓ పబ్ లో పరిచయమైన అమ్మాయి ద్వారా ఫోన్ నెంబరుకు వాట్సాప్ చేసి ఆ మహిళ సంప్రదించగా, మసాజ్ చేయించుకోవచ్చు అని సంబరపడిన ఆ యువకుడికి 8 మంది అమ్మాయిలూ ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.

కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే, వరుసగా ఎనిమిది మంది ఆఫ్రికన్ మహిళలు ఒకేసారి ఫ్లాట్ లోకి వచ్చారు. అతడిని గదిలో నిర్భందించి అతని వద్ద ఉన్న 11 లక్షల నగదుతో పాటుగా ఫోన్, విలువైన బంగారం వస్తువులు దొంగతనం చేసి వెళ్ళిపోయారు. మసాజ్ చేస్తామంటూ ఓ అడ్రస్‌, ఫోన్‌నెంబర్‌తో విజిటింగ్ కార్డును తయారుచేసి పారిస్‌లోని వివిధ ప్రదేశాలలోని అబ్బాయిలకు ఈ విధంగా యర వేస్తున్నారు.

పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తామని బెదిరించి వెళ్ళారు. ఆ వ్యక్తి నేరుగా పోలీసులను సంప్రది౦ఛి అసలు విషయాన్ని వారికి చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితురాలిని ట్రాప్ చేసి అరెస్టు చేసి విచారణ చేయగా ఆమె ఇతరుల వివరాలు కూడా చెప్పడంతో, ఆమె గ్యాంగ్‌లోని ఇతర మహిళలను కూడా వేరొక అపార్ట్‌మెంట్‌లో పట్టుకున్నట్టు పోలీసులు మీడియాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version