చైనాలో మరో 8 కొత్త వైరస్‌లు

-

కరోనా వ్యాప్తికి కారణమైన చైనాలో ఇప్పుడు మరో 8 కొత్త వైరస్లు బయటపడ్డాయి. హైనన్ ప్రావిన్స్లో ఎలుకల నుంచి సేకరించిన 700 శాంపిళ్లను పరీక్షించిన పరిశోధకులు వీటిని గుర్తించారు. వీటిలో రెండు వైరస్లు కరోనాకు మూలమైన సార్స్-కొవ్ -2 ఫ్యామిలీకి చెందినవని తెలిపారు. ఈ కొత్త వైరస్లు మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఈ వైరస్లపై మరింత పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. గబ్బిలాల్లోని వైరస్‌లపై అనేక పరిశోధనలు చేసిన ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ ఈ వివరాలను వైరోలాజికా సినికా జర్నర్ లో ప్రచురించారు. ఈ వైరస్ లు మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్ని ఆమె పిలుపునిచ్చారు.

8 NEW Viruses Discovered In China With 'High Probability' Of Infecting  Humans | World News, Times Now

వైరోలాజికా సినికా అనే పత్రిక చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం) యొక్క ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్ కింద పనిచేస్తుంది. కొత్త అధ్యయనంలో 201-2021 మధ్య హైనాన్ లో పట్టుకున్న ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరించారు. వీటిని పరీక్షిస్తే కొవ్-హెచ్ఎంయూ-1 అని పిలిచే ఒక కొత్త కరోనావైరస్‌తో సహా కొత్త నోవల్ వైరసెస్ వెలుగులోకి వచ్చాయి. వీటిలో కొన్ని మానవుడి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం కూడా ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version