హీరో అల్లు అర్జున్ పేరు మార్పు..?

-

అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పేరులో మార్పులు చేసుకోవాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. పేరులో మార్పులు చేసుకుంటే కెరీర్ బాగుంటుందని, మరిన్ని విజయాలను అందుకుంటారని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన నేమ్ స్పెల్లింగ్‌లో యు, ఎన్ అక్షరాలను జోడించాలనే యోచనలో బన్నీ ఉన్నట్టు సమాచారం. కాగా ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కాగా పుష్ప-2 ప్రీమియర్స్ షో సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్దకు చేరుకోవడం.. తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించింది. ఆమె కుమారుడు తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. బెయిల్ రావడం జరిగింది. పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్న విషయం విధితమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version