నేటి నుంచే ఇండియాలో 80 కొత్త రైళ్ళు…!

-

ఇప్పటికే నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా 80 కొత్త ప్రత్యేక రైళ్లు ఈ రోజు (శనివారం) నుండి నడవడం ప్రారంభిస్తాయని ఇండియా రైల్వే బోర్డ్ పేర్కొంది. ఈ రైళ్లకు రిజర్వేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్న అన్ని రైళ్లను రైల్వే పర్యవేక్షిస్తుందని రైల్వే బోర్డ్ చైర్మన్ పేర్కొన్నారు. “ఒక రైలుకు డిమాండ్ ఉన్నచోట, వెయిటింగ్ లిస్ట్ పొడవుగా ఉన్నచోట, అప్పటికే ఉన్న రైలు కంటే ముందుగానే క్లోన్ రైలును నడిపిస్తామని చెప్పారు.

తద్వారా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. 80 కొత్త రైళ్లను నిర్ణయించడంలో కీలకమైన అంశం ఏమిటంటే వలస కార్మికుల కోసమే అని తెలుస్తుంది. వలస కార్మికులు తిరిగి తమ విధులకు చేరుకుంటున్నారు. అందుకే వారి కోసం కొత్త రైళ్ళను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 230 రైళ్లలో 12 రైళ్లకు ఆక్యుపెన్సీ చాలా తక్కువ. కాని మేము వాటిని నడుపుతున్నామని పేర్కొన్నారు. బోగీల సంఖ్యను తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version