తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీవీపై 9 కేసులు నమోదు

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. గతంలో ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాంగోపాల్ వర్శ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒంగోలు పోలీస్‌స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదవ్వగా..ఇటీవల ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని కోరారు. అందుకు ఆయన నుంచి స్పందన కరువైంది.

దీంతో ఆర్జీవీని అరెస్టు చేసేందుకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. రెండ్రోజులుగా ఆయన హైదరాబాద్‌లో లేకపోవడంతో ప్రస్తుతం 6 పోలీస్ బృందాలు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయనపై 9 కేసులు నమోదయ్యాయి. ఆర్జీవీ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news