9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య…!

-

ఆత్మహత్య చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో కాస్త ఫ్యాషన్ అయింది అనే ఆరోపణలు వస్తున్నాయి. చిన్న మాట అన్నా సరే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ఘటన జరిగింది. ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెంలో స్నేహలత అనే చిన్నారి ఆత్మహత్య చేసుకుంది.

కాలి పట్టిలు పోగోట్టుకుందని బాలికను తల్లి మందలించింది. ఈ నెల 11 న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది స్నేహ లతా. ఆమె వయసు 9 ఏళ్ళు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version