బాసర ట్రిపుల్ ఐటీ లో 90 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్. తెలంగాణలోని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో రెండు నెలల్లో తొమ్మిది ఫుడ్ పాయిజన్ సంఘటనలు బయటపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మెస్ కాంట్రాక్టర్లు ఉండడం వల్లనే పిల్లలు అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకుని వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయిస్తోందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి హాస్టల్స్ విసిట్ చేయాలని డిమాండ్ చేశారు.
టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ విద్యాసంస్థల్లో ని హాస్టల్స్ లో కలుషిత ఆహారం, కలుషిత నీళ్లతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది అని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో ఇబ్బంది జరిగిన హెల్త్ మినిస్టర్ వెళ్ళలేదు అని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతుంటే సిల్లీ ఇష్యూస్ అని అంటున్నారని మండిపడ్డారు.