ధోనీ ఎందుకు సడన్ గా వీళ్ళందరికీ టార్గెట్ అయ్యాడు ?

-

భారత్ మాజీ కూల్ కెప్టెన్ ధోని ఇప్పుడు అందరికీ టార్గెట్ అయిపోయాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్పు ఈ విషయంలో ధోని మళ్లీ ఆడటానికి రెడీ అవుతున్నట్లు టీమ్ లోకి రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే చాలామంది భారత్ జట్టుకు చెందిన రిటైర్మెంట్ సీనియర్లు ధోనీ జట్టులోకి రావడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా గౌతమ్ గంభీర్ ఈ విషయంపై బహిరంగంగా ప్రశ్నించేశాడు. అదెలా కుదురుతుంది, ధోని ఎలా జాతీయ జట్టుకు ఆడతాడు అని గౌతం గంభీర్ ప్రశ్నించాడు. ఏ రేంజ్లో సీనియర్లు చాలామంది కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు.ధోనీపై ఇంత సడన్ గా సీనియర్ ఆటగాళ్లంతా టార్గెట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దీనికి వెనకాల కారణాలు చూస్తే అప్పట్లో ధోనీ కెప్టెన్ గా ఉన్న టైంలో…రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న ఆటగాళ్లను ధోని చెప్పుకోలేని ముప్పుతిప్పలు పెట్టేవాడట. జట్టులో ధోని టార్చర్ తట్టుకోలేక ల‌క్ష్మ‌ణ్, సెహ్వాగ్, గంభీర్ వంటి ఆట‌గాళ్లు రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది అంట. ద్రావిడ్, స‌చిన్ ల‌ను ధోనీ ట‌చ్ చేయలేక‌పోయాడేమో కానీ.. త‌న క‌న్నా కాస్త సీనియ‌ర్లే అయిన సెహ్వాగ్, యువీ, గంభీర్ వంటి వాళ్ల‌ను బ‌య‌ట‌కు క‌నిపించ‌ని రీతిలో తిప్ప‌లు పెట్టాడ‌నే అభిప్రాయాలున్నాయి.

 

ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఏ ఫిట్నెస్ లేకుండా మళ్లీ ధోనీ జాతీయ జట్టులోకి రావడం ఏమిటి అని చాలా మంది సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ ఆడి అందులో సత్తా చాటిన  ధోనీని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎటువంటి మ్యాచ్ ఆడకుండా ఫామ్ లో ఉన్నాడో, లేదో తెలియకుండా ఏ విధంగా జాతీయ జట్టులోకి తీసుకుంటారంటూ ప్ర‌శ్నిం చేస్తూన్నారు. మొత్తంమీద చూసుకుంటే జట్టులో ఉన్న టైంలో తమ కెరీర్ లతో ఆడుకున్న ధోనీని…ఇప్పుడు చాలా గట్టిగానే మాజీ ఆటగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version