హైదరాబాద్ లో మరో దారుణం.. 9వతరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం !

-

మన దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఏదో మూలన మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్లోని షామీర్పేట్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూల్ విద్యార్థి పై ఏకంగా ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. శామీర్ పేట మండల కేంద్రం లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఈ నెల 22వ తేదీన యధావిధిగా పాఠశాలకు వెళ్ళింది ఆ బాలిక. మాస్కు పెట్టుకో లేదనే కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థిని ఆదేశించిన ప్రధానోపాధ్యాయుడు.. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించడంతో బాలిక భయపడి తల్లితో సహా ఎవరికీ చెప్పలేకపోయింది. అయితే అదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు బుధవారం కలిసిన సందర్భంగా బాలిక జరిగిన ఘటనను ఆమె వివరించింది. దీంతో ఆమె బాలిక తల్లిదండ్రుల తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రధాన ఉపాధ్యాయుని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రజల దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version