ప్రియుడి కోసం 40 కిలోమీటర్లు నడిచి వెళ్లి పెళ్లి చేసుకున్న అమ్మాయి…!

-

లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. వేడుకలు, వినోదాలు అన్నీ కూడా దాదాపుగా ఆగిపోయాయి. చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఎవరూ చేయడం లేదు. ప్రజలు అందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. కాని ఒక జంట ప్రేమ మాత్రం లాక్ డౌన్ ని ఎదుర్కొంది. లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో తన ప్రియుడు కోసం ఒక అమ్మాయి 40 కిలోమీటర్లు నడిచి వెళ్లి వివాహం చేసుకుంది.

కృష్ణా జిల్లా బందరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈదేప్పలికి చెందిన కల్లేపల్లి సాయి పున్నయ్య హనుమాన్ జంక్షన్ కి చెందిన భవాని కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. విషయం యువతీ ఇంట్లో తెలియడం తో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసారు. పున్నయ్యకు ఫోన్ చేసి తమ అమ్మాయి జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించారు. కాని వాళ్ళు మాత్రం ఎక్కడా భయపడలేదు. ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.

భవాని జంక్షన్ నుంచి నడిచి వెళ్ళింది. కాలినడకన బందరు వెళ్లి అక్కడ తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. దాదాపు 40 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది ఆమె. వారి వివాహం బుధవారం జరిగింది. ఇరు కుటుంబాలు ఈ వివాహంపై ఆగ్రహం వ్యక్తం చేయడం తో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భవిష్యత్తులో ఇబ్బంది ఉంటే తమ వద్దకు రావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version