లాక్‌డౌన్‌.. ప్రియుడి కోసం 40 కి.మీ నడిచి తాళికట్టించుకుంది

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఓ ప్రేమికురాలి ప్రేమను ఆపలేకపోయింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న కూడా ప్రియుడిపై ఇష్టంతో మొండి ధైర్యంతో ముందుకు సాగింది. 40 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ అతడితో తాళికట్టించుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయి పున్నయ్య, హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన సీహెచ్‌ భవానీ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన భవానీ.. పున్నయ్యనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. ఇందకు భవానీ తల్లిదండ్రులు అంగీకరించలేదు. పున్నయ్యకు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారు.

దీంతో పున్నయ్య, భవానీలు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పున్నయ్య కోసం.. భవానీ తన ఇంటి నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న మచిలీపట్నానికి ఒంటరిగా బయల్దేరింది. మొండి ధైర్యంతో అక్కడికి చేరుకుని ప్రియుడు పున్నయ్యను కలిసింది. అక్కడే బుధవారం పున్నయ్య, భవానీల వివాహం జరిగింది. అనంతరం వీరు పోలీసుల రక్షణ కోరడంతో.. వారు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version