అక్రమ సంబంధాల వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడితే మరి కొంతమంది పరువు పోయిందని భావించి తమ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. ఇలా రోజురోజుకు ఎన్నో ఘటనలు చూస్తున్నా కూడా మానవులకు ఎలాంటి భయం లేకుండా అక్రమ సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటున్నారు. భర్త రెండేళ్లుగా దుబాయ్ లో ఉండగా భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
దీంతో గర్భం దాల్చడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహ* చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బీహార్ లోని జంగాపల్లి గ్రామం అంబికానగర్ లో రామయ్య, లత అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఐదేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పెళ్లికి ముందు రామయ్య దుబాయ్ లో పనిచేస్తుండేవాడు. పెళ్లి జరిగిన తర్వాత ఒక బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు.
కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదురు కావడంతో మళ్లీ దుబాయ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. లత తన పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. భర్త లేని కారణంగా పక్కింట్లో ఉంటున్న సతీష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం అతి కొద్ది రోజుల్లోనే అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సతీష్, లతతోనే ఉండేవాడు. ఇలా వీరి సంబంధం కొన్ని సంవత్సరాల పాటు సాగింది. ఈ క్రమంలోనే లత ఐదు నెలల కిందట గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకోలేక పోయింది. తన భర్త లేకుండా ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ఎవరికైనా చెబితే పరువు పోతుందని, తన భర్తకు తెలిస్తే తనను చంపేస్తాడనే భయంతో తన పిల్లల బాధ్యతలను తన అక్కకు అప్పగించి లత ఆత్మహ* చేసుకుంది.