తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. మార్చి 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేయనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. సర్వదర్శనం, లడ్డు కౌంటర్లు, గదులు కేటాయింపు, రిఫండ్ కౌంటర్లు వద్ద ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.
దీంతో భక్తులు ఎంత మంది వచ్చారు… ఎన్ని లడ్డులు కొనుగోళ్ల దానిపై క్లారిటీ వస్తుందని టీటీడీ భావిస్తోంది. కాగా, మార్చి 3వ తేదీ నుంచి 7వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ పాలక మండలి. అలాగే, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి.