డబ్బుల కోసం కొందరు కొంతకైనా తెగిస్తున్నారు. డబ్బు అనే మాయలో పడి నిండిప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. రూ.500 కోసం గుత్తేదారు ఏకంగా కార్మికుడిని హతమార్చాడు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం ప్రకారం..గుత్తేదారు సాయి, డైలీ లేబర్ శ్రీనివాస్ మధ్య రూ.500 కోసం గొడవ తలెత్తింది. తనకు రావాల్సిన కూలీ డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్ గుత్తేదారును నిలదీశాడు.
ఇద్దరూ అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. గుత్తేదారు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్య తగవులాట జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గుత్తేదారు సాయి పక్కన ఉన్న డ్రైనేజీ మూతతో శ్రీనివాస్ తలపై బలంగా బాదాడు. తీవ్రమైన గాయం, రక్తస్రావం కావడంతో శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
500 రూపాయల కొరకు డైలీ లేబర్ ను చంపిన గుత్తేదారు…
👉రంగారెడ్డి:రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరి మధ్య 500 రూపాయల విషయంలో గొడవ.
👉మద్యం మత్తులో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు.
👉ఆవేశానికి లోనైనా సాయి పక్కనే ఉన్న డ్రైనేజ్ మూత తీసుకొని శ్రీనివాస్ తలపై కొట్టడంతో మృతి… pic.twitter.com/3VIoZiFBih— ChotaNews App (@ChotaNewsApp) December 30, 2024