వెచ్చదనం కోసం బైకును తగులబెట్టబోయిన మద్యం ప్రియుడు.. వీడియో వైరల్

-

కొందరు మద్యం సేవించాక చేసే పనులు అందరికీ కోపం తెప్పిస్తుంటాయి. వారు ఏం చేస్తున్నారో వారికే తెలీదు. ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసహ్యం కలిగేలా వారి చేష్టలు ఉంటాయి. కొందరు ఫుల్లుగా మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడే రోడ్ల మీద, డ్రైనేజీ కాలువల వద్ద, చెత్త కుప్పల వద్ద పడుకోని దొర్లుతుంటారు.

మరికొందరు ఇతరులతో అనుచితంగా ప్రవర్తించడం, గొడవలు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. దీనంతటికీ మద్యానికి బానిస కావడమే కారణంగా తెలుస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి అర్ధరాత్రి అందరూ చూస్తుండగా వెచ్చదనం కోసం బైకును మంటల్లో తగులబెట్టాలని చూశాడు. ఆ వెంటనే అటుగా వెళ్తున్నకొందరు అతన్ని అడ్డుకున్నారు. ఎంతచెప్పినా వినకపోవడంతో నాలుగు దెబ్బలు కూడా వేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news