జీడిమెట్లలో బీభత్సం సృష్టించిన బస్సు..ఒకరి మృతి

-

జీడిమెట్లలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన రామకృష్ణ ట్రావెల్స్‌‌కు చెందిన బస్సు అదుపు తప్పి షాపూర్ నగర్‌లో రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. అంతేకాకుండా ఆ వ్యక్తిని చౌరస్తా నుంచి సాగర్ హోటల్ వరకు ఈడ్చుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని జీహెచ్ఎంసీ-23 సర్కిల్ ఇంచార్జ్ హరికృష్ణగా గుర్తించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించిన బీభత్సంలో మరికొందరు వాహనదారులు గాయపడగా, పలు వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా, ప్రమాదంలో మరణించిన తమ ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయలంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version