ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు..15 మంది మ‌ృతి

-

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది దుర్మరణం పాలయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version