చెట్టును ఢీకొట్టిన కారు.. మహిళా మంత్రికి, ఎమ్మెల్సీకి తీవ్రగాయాలు

-

రోడ్డు ప్రమాదంలో మహిళా మంత్రి,ఎమ్మెల్సీకి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. కర్ణాటక కేబినెట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మి హెబ్బాళ్కర్, ఆమె సోదరుడు ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి కలిసి
బెంగళూరులో ఓ వివాహానికి హాజరై తిరిగి కారులో బెళగావికి వస్తున్నారు.

 

ఈ క్రమంలోనే కిత్తూరు తాలుకా అంబడగట్టి గ్రామ శివారులోకి రాగానే వారి కారుకు అడ్డంగా ఓ వీధి కుక్క వచ్చింది. దీంతో అప్రత్తమైన డ్రైవర్ కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ముఖం, వెన్నుముఖ భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి తలకు గాయమైనట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఆ ఇద్దరిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news