సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబం సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహావిష్కరణ చేశారు సీఎం చంద్రబాబు.
అటు గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఇంటి నుంచి గ్రామ దేవత ఆలయం వరకు నడిచి వెళ్లిన చంద్రబాబు కుటుంబం.. ప్రత్యేక పూజలు చేసింది. ఇక సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలలో నారా రోహిత్ ఫ్యామిలీ కూడా పాల్గొంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెలో గ్రామదేవతకు కుటుంబంతో కలిసి సీఎం చంద్రబాబు గారు పూజలు.#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/Lwv141EWJN
— Telugu Desam Party (@JaiTDP) January 14, 2025