జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు..!

-

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అత్యాచారం చేశాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మూడు రోజుల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు.

Key points in the FIR registered on Johnny Master

జానీ మాస్టర్ ప్రస్తుతం లఢఖ్ లో ఉన్నట్టు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో లఢఖ్ బయలుదేరారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలుకి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆమె నుంచి ఇప్పటికే సఖి, భరోసా బృందాలు తగిన వివరాలను సేకరించాయి. తొలుత ఆయన నెల్లూరులో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడి పోలీసులను సంప్రదించారు.  ఈ కేసులో ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version