రూ.400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే నాగార్జున N Convention కూల్చారు : బాల్క సుమన్

-

హీరో నాగార్జున భవనం కూల్చివేతపై BRS నేత బాల్క సుమన్ సంచలన కామెంట్స్ చేశారు. నాగార్జునను సీఎం రేవంత్ రెడ్డి రూ.400 కోట్లు అడిగారని..   డబ్బు ఇవ్వడానికి నాగార్జున ఒప్పుకోనందుకే ఆయనకు సంబంధించిన N-కన్వెన్షన్‌ను హైడ్రా చేత కూల్చేశారని ఆరోపించారు.  తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త హామీలు అమలు చేయమంటే డ్రామాలు ఆడుతున్నారు. ఆరు గ్యారెంటీల హామీలపై పచ్చి దగా చేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడాది కావస్తున్నా ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. కొత్తది అమలు చేసుడు పక్కన పెడితే ఉన్నది నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అలా ప్రజలను ఇంకెన్నాల్లు మోసం చేస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్దేమో కానీ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం వద్ద ఉన్న రాహుల్ గాంధీ విగ్రహాన్ని తాము కూల్చివేస్తామన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version