ప్రధాని నివాసంలొో దూడకు జన్మనిచ్చిన ఆవు.. దూడతో మోడీ వీడియో వైరల్..!

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు చిన్న పిల్లలు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఎక్కడికైనా వెళ్లితే.. తప్పకుండా చిన్నపిల్లలను పలుకరిస్తూ ఉంటారు. చిన్న పిల్లలతో పాటు జంతువుల పిల్లలు అంటే కూడా ఇష్టం అని తాజాగా నిరూపించాడు ప్రధాని మోడీ. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాన మంత్రి నివాసంలోని ఒక అవు దూడకు జన్మనిచ్చింది.

ఆవు సర్వసుఖ ప్రదాయిని అని మన గ్రంథాల్లో చెప్పారు. దూడ నుదుటిపై కాంతి గుర్తు ఉంది. దూడకు ‘దీప్జ్యోతి’ అని పేరు పెట్టాడు ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాదు.. ఆ లేగదూడతో కొద్ది సేపు ఆడుకున్నాడు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఓ బుజ్జి లేగ దూడను ముద్దు చేశారు. తమ ఇంట్లో కొత్త కుటుంబ సభ్యురాలు వచ్చిందని పేర్కొన్నారు. దూడకు పూజ చేయడంతో పాటు దానిని ఆయన బిడ్డలా ఎత్తుకొని తిరగడం విశేషం. ప్రధాని మోడీ ఆవు దూడతో ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version