కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ తరపున వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలల్లో పాడి కౌశిక్ ఒకరు.. వివాదాస్పదమైన వ్యాఖ్యలతో పాటు.. పార్టీకార్యక్రమాలతో ఆయన మీడియాలో నిలుస్తుంటారు.. తాజాగా అరెకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్టాల్లో హాట్ టాపిక్ గా మారింది.. అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ ఎస్ లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి..
ఎమ్మెల్యే గాంధీని ఉద్దేశించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు గ్రేటర్ లోని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఎక్కడో పుట్టిన గాంధీ… ఇక్కడికి వచ్చి సవాల్ విసురుతున్నాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.. గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు..వారి మద్దతుతోనే బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో గెలుపొందారు.. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 24 స్థానాలు ఉండగా.. బీఆర్ఎస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇస్తే.. సెటిలర్ల నుంచి తమకు ఇబ్బంది వస్తుందనే భావనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారట.. దీంతో మేడ్చల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, అంబర్‌పేట, ఎల్‌బీనగర్, సనత్‌నగర్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఈ అంశంపై మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం ఇప్పుడు చర్చలకు దారి తీస్తోంది..
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మద్దతు ఇస్తే.. తమ నియోజకవర్గ ప్రజలకు దూరమవుతామనే ఆందోళనలో సదరు ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారట.. అందుకే ఒక్క హరీష్ రావు తప్పా ఎవ్వరూ సీన్ లోకి వెళ్లలేదని పార్టీలో చర్చ నడుస్తోంది..
కౌశిక్ రెడ్డి మాటలతో ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో సెటిలర్లంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో కౌశిక్ వ్యాఖ్యలు పార్టీకి కూడా డ్యామేజే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఈ వివాదానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎలా పుల్ స్టాప్ పెడుతుందో చూడాలి..