యూరియా కోసం కలెక్టర్ కాళ్లు మొక్కాడు ఓ రైతు. ఈ సంఘటనకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ములుగు జిల్లా కేంద్రంలో యూరియా దొరకడం లేదని, యూరియా లేకపోతే పంటలు నాశనమవుతాయని ఆవేదనతో కలెక్టర్ కాళ్లు మొక్కాడు రైతు. దీనిపై గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇక అటు యూరియా కోసం క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చొని ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు మరో రైతు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లి గ్రామంలో గల హాక సెంటర్ వద్ద క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చొని ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు రాజి రెడ్డి అనే రైతు. ఈ సంఘటనలో రైతుకు స్వల్ప గాయాలు అయ్యాయి. దింతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
యూరియా కోసం కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు
ములుగు జిల్లా కేంద్రంలో యూరియా దొరకడం లేదని, యూరియా లేకపోతే పంటలు నాశనమవుతాయని ఆవేదనతో కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు pic.twitter.com/UOjDsznr5B
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2025