నందమూరి అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా రిలీజ్ విషయంలో బిగ్ అప్డేట్ వచ్చింది. అభిమానులకు షాక్ ఇస్తూ అఖండ 2 సినిమా రిలీజ్ తేదీని వాయిదా వేశారు. వాస్తవానికి సెప్టెంబర్ 25వ తేదీన బాలకృష్ణ నటించిన ఈ అఖండ 2 రిలీజ్ అవుతుందని ముందు ప్రకటించారు. కానీ ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

దీంతో బాలయ్య నటిస్తున్న అఖండ 2 సినిమా రిలీజ్ ను వాయిదా వేసినట్లు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అలాగే విఎఫ్ఎక్స్ పనులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర సినిమా విడుదల వాయిదా పడగా ఇప్పుడు నందమూరి బాల కృష్ణ నటించిన సినిమా కూడా వాయిదా పడింది.