తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం క్యూ లైన్లు కడుతున్నారు రైతులు. వరి అలాగే పత్తి చేనులో చేతికి వస్తున్న దశలో.. యూరియా కొరత వచ్చి పడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు రైతులు.

అయితే యూరియా కోసం… చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ క్యూ లైన్ కడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను పట్టుకుని యూరియా కోసం లైన్ కట్టింది. ముఖ్యంగా ఇందులో జ్వరంతో ఉన్న కూతురిని కూడా తీసుకువచ్చింది. అయినప్పటికీ ఆ చిన్నారికి సిరప్ తాగిస్తూ యూరియా కోసం లైన్ కట్టింది మహిళ రైతు. ఈ సంఘటన… హనుమకొండ జిల్లా పరకాల రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారు.
హృదయాలను కదిలించే వీడియో
జ్వరంతో ఉన్న కూతురికి సిరప్ తాగిస్తూ యూరియా కోసం పడిగాపులు కాస్తున్న మహిళా రైతు
హన్మకొండ జిల్లా పరకాల రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు pic.twitter.com/f2KsT9gVuz
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2025