వైఎస్ జగన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ అది.. 11 రావాలనుకున్నాడు 11 ఇచ్చాడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్‌లు పెట్టి మాట్లాడే మాటలు అసెంబ్లీకొచ్చి మాట్లాడాలని చురకలు అంటించారు అయ్యన్న పాత్రుడు.

నేను అసెంబ్లీకి రాను ఇంట్లోనే కూర్చుంటాననడం పద్ధతి కాదని ఫైర్ అయ్యారు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఇక అటు ఏపీలో ప్రస్తుతం రైతులకు యూరియా కొరత ఏర్పడింది. దీంతో వైసిపి నేతలు “అన్నదాత పోరు” పేరిట ఈరోజు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. రైతులు, రైతు సంఘాలతో కలిసి అన్ని ఆర్డిఓ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు జగన్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు.
వైఎస్ జగన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ అది.. 11 రావాలనుకున్నాడు 11 ఇచ్చాడు
ప్రెస్ మీట్‌లు పెట్టి మాట్లాడే మాటలు అసెంబ్లీకొచ్చి మాట్లాడాలి
నేను అసెంబ్లీకి రాను ఇంట్లోనే కూర్చుంటాననడం పద్ధతి కాదు
– అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు pic.twitter.com/4jQxAjUQBV
— BIG TV Breaking News (@bigtvtelugu) September 9, 2025