సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ ఇంట్లో ఉండాల్సిందే. ఇది మన తెలుగు ప్రజల సాంప్రదాయం. మరికొందరూ మద్యం ప్రియులు అయితే ప్రతిరోజు తినడానికి కూడా వెనుకాడరు. చికెన్ తో వెరైటీ రెసిపీలు చేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కొండెక్కిన చికెన్
ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయాయి. ఏపీలో అయితే చికెన్ కిలో రూ. 30 కే వచ్చేస్తోంది. ఇది
తెలిసిన చికెన్ లవర్స్ ఎగిరి గంతులేస్తున్నారు. అయితే చికెన్ ధరలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే బర్డ్ ఫ్లూ ప్రభావం. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది.
దీంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. అయినా కూడా చికెన్ కొనడానికి.. తినడానికి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది. బర్డ్ ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు పలువురు. కొనుగోళ్లు తగ్గడంతో చికెన్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపిచగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో కూడా పలువురు అధికారులు కొద్ది రోజుల వరకు చికెన్ తినకూడదని సూచిస్తున్నారు. కానీ కొందరూ మాత్రం మనకు ఏం అవుతుంది లే అని లాగించేస్తున్నారు.