సెలవు రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. భారీ ఆదాయం

-

ఏపీలో ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులు అయినప్పటికీ కూడా పని చేశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావడంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యలయాలు పని చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సిబ్బంది ఉగాది, రంజాన్ పండుగ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లు నిర్వహించారు.

శనివారం అమవాస్య కావడంతో ఆదివారం ఉగాది పండుగ రోజు కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. సోమవారం రంజాన్ పండుగ రోజు కూడా స్వల్ప సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8కోట్ల వరకు ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రబుత్వానికి వచ్చింది. అందులో రూ.2కోట్ల ఆదాయం గుంటూరు జిల్లా నుంచి రావడం విశేషం. మొత్తానికి రెండు రోజుల్లో కలిపి మొత్తం రూ.10కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. సెలవు రోజుల్లో పని చేయడంతో 10.90 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version