హైదరాబాద్ మహానగరంలో రోజూ దుర్గం చెరువ కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వందల మంది వస్తుంటారు.దీంతో నిత్యం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి రద్దీగా ఉంటుంది.ఈ బ్రిడ్జి చూడడానికి నగర వాసులే కాకుండా జిల్లాల నుంచి తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ రాత్రుళ్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో రోడ్డుపై రద్దీ పెరిగి ప్రమాదాలకు దారి తీస్తున్న నేపథ్యంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాన్ని నిలిపితే రూ. 1000 ఫైన్ వేస్తామని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. వంతెనపై వాహనాన్ని నిలిపి సెల్ఫీ తీసుకుంటుండగా కారు ఢీ కొనడంతో ఓ వ్యక్తి చనిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇకపై కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే వేడుకలు కూడా చేసుకునేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇనార్బిట్ మాల్ వద్ద వెహికల్స్ నిలిపి ఫుట్పాత్ మీదుగా వచ్చి వీక్షించవచ్చని వెల్లడించారు.