పిల్లలను పెంచడం అనేది అంత తేలికైన పని కాదు. వాళ్లకు స్నానం చేయించడం, ఫుడ్ పెట్టడం, నిద్రపుచ్చడం ఇవన్నీ చేయాలంటే.. ఎంతో ఓపిక ఉండాలి.. ఒక్క పట్టాన తినరు. స్నానం చేసేప్పుడు ఒకటే ఏడుపు, నిద్రపోరు.. మనకేమో నిద్రవస్తుంది.. వాళ్లను పడుకోబెట్టకుండా నిద్రపోలే.. చాలా మంది.. చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి ఏవేవో కథలు చెప్తుంటారు. ఏదో ఒక ముచ్చట చెప్తే కానీ అది వినుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. అయితే పిల్లలను నిద్రపుచ్చాలని మీరు కొన్ని చెప్పకూడని మాటలను వాళ్లతో చెప్పేస్తుంటారు. దాని వల్ల వారి నిద్ర డిస్టబ్ అవుతుంది. ఇంతకీ ఆ చెప్పకూడని విషయాలు ఏంటంటే..
దెయ్యాల కథలు :
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు దెయ్యాల కథలు చెబుతుంటారు. ఇవి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా వాటిని ఆసక్తి వింటూ నిద్రలోకి జారుకుంటారు. కానీ, అది తప్పు. ఇలా చేస్తే వారికి నిద్ర పట్టదు. అలాగే అసలు దెయ్యం వస్తుందేమోనని భయపడుతుంటారు. కాబట్టి, పిల్లలను నిద్రపుచ్చడానికి ఇలాంటి కథలను ఎప్పుడూ చెప్పకండి.
బాధ కలిగించే విషయాలు చెప్పకండి :
పిల్లలు నిద్రపోకపోతే వారికి బాధ కలిగించే లేదా ఒత్తిడి మరియు విచారాన్ని కలిగించే విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడకండి. ఇవి పడకగదిలో మాట్లాడాల్సిన విషయాలు కావు. మరుసటి రోజు మీ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఇలా చేయకండి.
ఇతరులతో పోలిక :
పిల్లలను నిద్రపోయేటప్పుడు ఇతరులతో పోల్చడం మానుకోండి. వాళ్లు చూడు ఎంత త్వరగా తినేసి నిద్రపోతారో..నువ్వు ఉన్నావు అసల నిద్రపోవు అని ఇలా చెప్పకండి. మీరు మీ పిల్లలను పోల్చడం ద్వారా మీ పిల్లల అభివృద్ధి బాగా ప్రభావితమవుతుంది.
మీరు ఏమి కాబోతున్నారు :
పిల్లలు నిద్రపోతున్నప్పుడు భవిష్యత్తులో వారు ఏమి చేయాలనుకుంటున్నారు అని అడగవద్దు. ఇలా అడగడానికి సరైన సమయం అది కాదు.